లాంఛనంగా ప్రారంభమైన "నాలో నువ్వు"
నూతన తారాగణంతో జయసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న "నాలోనువ్వు" చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ప్రొడక్షన్స్ వారి కార్యాలయంలో చిత్ర షూటింగ్ "తొలిషాట్"ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత జయసింహారెడ్డి చిత్రం గురించి చెబుతూ... ప్రేమను కథాంశంగా తీసుకుని రూపొందనున్న చిత్రమైనా అందులోని అంశాలు కొత్తదనంగా ఉండబట్టే నేనే స్వీయదర్శకత్వంతో నిర్మిస్తున్నానని తెలియజేశారు.
నూతన నటీనటుల్నిఇందులో పరిచయం చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ చిత్రంలో ఆరు పాటులున్నాయని తెలిపిన ఆయన, సంగీత దర్శకుడు దేవేందర్ నేతృత్వంలో ప్రస్తుతం మ్యూజిక్స్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని అన్నారు. నవంబర్ ద్వితియార్థంలో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు.
ఫిబ్రవరి 14 "వాలైంటేన్స్‌డేనాడు" చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ శ్రీరామ్, ఆర్ట్: విజయకృష్ణ, ఎడిటింగ్: రంగస్వామి, కథ, మాటలు, నిర్మాత, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జయసింహా రెడ్డి.