1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

కథలో జాగ్రత్త తీసుకోక పోవడం పొరపాటే: ప్రభాస్

కథల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడం పొరపాటేనని యువ నటుడు ప్రభాస్
కథల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడం పొరపాటేనని యువ నటుడు ప్రభాస్ అభిప్రాయపడ్డారు. తన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు నుంచి నటవారసునిగా తెలుగు వెండి తెరకు పరిచయమైన ప్రభాస్ ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ.. యువసామ్రాట్ నాగార్జున నటించిన గీతాంజలి వంటి చిత్రాలు చేయాలంటే ఎంతో ఇష్టమన్నారు. అయితే.. తనకు వచ్చే సినిమాలన్నీ పూర్తిగా యాక్షన్‌ కథతో ముడిపడి ఉన్నాయని అన్నారు.

అయినప్పటికీ.. అన్ని రకాల పాత్రలు చేసి సగటు ప్రేక్షకుడిని సంతోషపెట్టేందుకు కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం హీరోల పోటీ ఎక్కువగా ఉందని, ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే.. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏమీ లేదని, కష్టాన్ని నమ్ముకుంటే మాత్రం ఫలితం ఉంటుందని ప్రభాస్ అన్నారు. నా ఫేవరేట్ కోస్టార్ శ్రియ. అయితే త్రిషాతో నటించే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఇది దర్శకుడి అభీష్టం మేరకే జరుగుతోందని అన్నారు.
About Writer
PNR