జీవితాంతం గుర్తుంచుకుంటా: మైసమ్మ
Publish: Thu, 25 Oct 2007 (11:48 IST)
Updated: Thu, 25 Oct 2007 (11:47 IST)
ఐటం సాంగ్‌లతో తెలుగు వెండి తెరకు పరిచయమైన తనను హీరోయిన్ రేంజ్‌కు తీసుకెళ్లిన 'మైసమ్మ ఐపీఎస్' పాత్రను కలకాలం గుర్తుంచుకుంటానని ఐటంబాంబ్ ముమైత్ ఖాన్ వ్యాఖ్యానించింది. అందుకు తగిన రీతిలోనే ఈ పాత్రను దర్శక నిర్మాతలు తీర్చి దిద్దారన్నారు. ఈ చిత్రానికి మంచి కథను అందించిన కేంద్ర మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణ రావుకి రుణపడి ఉంటానని ఆమె వ్యాఖ్యానించింది. అలాగే.. ఈ చిత్రం తనకు మంచి హీరోయిన్‌గా చక్కటి గుర్తింపు తెస్తుందని ముమైత్ ఆశాభావం వ్యక్తం చేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పాటలను ఈనెలాఖరులో విడుదల చేసేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. దర్శకరత్న కథ స్క్రీన్ ప్లే అందించగా, దాసరి పద్మ సమర్పణంలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ముమైత్‌తో పాటు.. షాయాజీ షిండే, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, విజయ్ చందర్, రమ్యశ్రీ, గీతాసింగ్ తదితరులు నటించగా, ఎంఎం.శ్రీలేఖ సంగీత బాణీలను సమకూర్చారు.