గిటార్ వాద్య సమ్మేళనంలో మేఘాలయ రికార్డు
ప్రపంచ రికార్డును సృష్టించే క్రమంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 2000 మంది గిటార్ వాద్యకారులు శుక్రవారం షిల్లాంగ్‌లో వాద్యసమ్మేళనంలో పాల్గొంటున్నారు. అయితే మేఘాలయ సృష్టించదలిచిన రికార్డుకు లండన్‌లో నవంబర్ 2న గిటార్ వాణిజ్యోత్సవంలో జరిగే ఇదే తరహా వాద్య సమ్మేళనంతో అనుకోని పోటీ తలెత్తనున్నది.
రికార్డును నెలకొల్పడంలో లండన్ రూపేణా తలెత్తుతున్న పోటీ తమ దృష్టికి వచ్చిందని మేఘాలయా సమాచార సాంకేతిక శాఖ మంత్రి రాబర్ట్ జీ లింగ్డో గురువారం మీడియాతో అన్నారు. కానీ షిల్లాంగ్‌లో శుక్రవారం జరిగే వాద్యసమ్మేళనంలో పాల్గొనే 2000 మంది వైవిధ్యమైన స్వర ప్రస్తారాలను సాగిస్తారని లింగ్టో పేర్కొన్నారు.
2007 సంవత్సరం జూన్ 3న అమెరికాలోని కన్సాస్ నగరంలో 1,683 గిటార్ వాద్యకారుల వాద్యసమ్మేళనం ప్రస్తుతం గిన్నిస్ బుక్ రికార్డుగా నమోదై ఉంది.