1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

''మిషన్ ఉస్తాద్‌''గా ఏ.ఆర్. రెహ్మాన్

'మిషన్ ఉస్తాద్‌'గా ఏ.ఆర్. రెహ్మాన్
దేశంలో మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన "మిషన్ ఉస్తాద్" సంగీత కార్యక్రమంలో ప్రముఖ సినీసంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహ్మాన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. త్వరలో ప్రసారాలు ప్రారంభించుకోనున్న హిందీ వినోదాత్మక టీవీ ఛానెల్ 9Xలో ఈ కార్యక్రమం ప్రసారం కానున్నది.

రెహ్మాన్‌తోపాటు ప్రముఖ గాయకులు, వినోదాన్ని పంచే నటులు మిషన్ ఉస్తాద్ కార్యక్రమంలో పాలు పంచుకుంటారని ఐఎన్ఎక్స్ మీడియా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఇంద్రాణి ముఖర్జీ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ మాట్లాడుతూ మిషన్ ఉస్తాద్‌లో పాల్గొనడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసారు.

వినోద రంగానికి చెందిన ప్రముఖులతో కలిసి ఈ కార్యక్రమంలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. భారతీయ టెలివిజన్‌లో మిషన్ ఉస్తాద్ విన్నూతమైన కార్యక్రమంగా నిలుస్తుందని అన్నారు.