1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్న ''కేరళ కుట్టి''

'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రంతో తెలుగు వెండి తెరకు పరిచయమైన కేరళ అందాల కుట్టి ఆసిన్
FileFILE
'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రంతో తెలుగు వెండి తెరకు పరిచయమైన కేరళ అందాల కుట్టి ఆసిన్ శుక్రవారం తన పుట్టిన రోజును జరుపుకోనుంది. ప్రస్తుతం పద్మశ్రీ కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'దశావతారం' చిత్రంలో ఆసిన్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. తన పుట్టినరోజు శుభ సందర్భంలో ఈ మళయాళ కుట్టి మాట్లాడుతూ.. తనకు ఇటీవలే బెస్ట్ యాక్టింగ్ యూనివర్శిటీలో డిగ్రీ వచ్చినట్టు చెప్పారు.

ఇంతకీ.. సినీ షూటింగ్‌లలో బిజీగా ఉండే ఆసిన్ యూనివర్శిటీలో డిగ్రీ ఎపుడు పొందిందనీ ఆశ్చర్య పోతున్నారా...? దీనికి ఆమె చెప్పిన సమాధానం ఒక్కటే. అదేనండి.. పద్మశ్రీ కమల్ నటనలో ఓ ఫ్రొఫెసరట. ఆయనతో నటించి మన్నలు పొందడం 'బెస్ట్ యాక్టింగ్‌ యూనివర్శిటీ డిగ్రీ'తో సమానమట.

ఇంతకీ మీ ఇష్టాఇస్టాలు ఏమిటనీ ప్రశ్నిస్తే.. చిన్నపిల్లల్లా కార్టూన్ ఛానల్స్ చూస్తుండటమనేనని చెప్పింది. సినిమాలు కాకుండా.. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతూ గడుపుతానని చెప్పింది. చిత్రాల్లో సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో కనిపించే.. ఈ ముద్దుగుమ్మ ఇంట్లో ఉంటే మాత్రం.. జీన్స్‌, టీషర్ట్స్‌ వేయాల్సిందేనట.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి