1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

జయాపజయాలు ఒకటే: వెంకీ

చిత్ర జయాపజయాలను ఒకటిగానే తీసుకుంటానని విక్టరీ వెంకటేష్ అన్నారు. ఈ సిద్ధాంతం నాన్నగారి నుంచి ఒంటబట్టించుకున్నట్టు
చిత్ర జయాపజయాలను ఒకటిగానే తీసుకుంటానని విక్టరీ వెంకటేష్ అన్నారు. ఈ సిద్ధాంతం నాన్నగారి నుంచి ఒంటబట్టించుకున్నట్టు చెప్పారు. తులసి సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా వెంకీ మాట్లాడుతూ.. సినిమా విడదలకాక మునుపు అందరూ టెన్షన్ పడ్డారు. అయితే.. నేను మాత్రం పెద్దగా ఫీల్ కాలేదు.

ఎందుకంటే.. సినిమాకు చేసిన టెక్నీషియన్లు అందరూ సీనియర్లు కావడంతో ఈ చిత్రంపై నాకు మంచి నమ్మకం ఉన్నది. ఈ చిత్రాన్ని ఘనవిజయం చేసిన అఖిలాంధ్ర ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. లక్ష్మీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, తులసి చిత్రాల విజయం హ్యాట్రిక్‌గా పోల్చుతున్నారు. నేను మాత్రం అలా భావించడం లేదు. మా నాన్నగారిలా సక్సెస్ ఫెయిల్యూర్స్‌ను ఒకేలా తీసుకుంటాను అని వెంకటేష్ అన్నారు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి