తొలిసారిగా ఇఫీ చిత్రోత్సవానికి టిక్కెట్లు
దేశానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చలనచిత్రోత్సవంగా పేర్కొనబడే ఇఫీ ప్రారంభ మరియు ముగింపు కార్యక్రమాలను ఇతర అంతర్జాతీయ చిత్రోత్సవాల తరహాలో నిరాడంబరంగా జరపనున్నారు. ప్రధాన దృష్టి అంతా కూడా ఇఫీ ప్రారంభ, ముగింపు చిత్రాలపైనే కేంద్రీకృతమవుతుంది. ఎటువంటి వినోదం కలిగించే కార్యక్రమాలకు ప్రస్తుత ఇఫీ ఉత్సవంలో చోటులేదు.
ఉత్సవానికి ముగింపుగా చివరి చిత్రం ప్రదర్శితమైన అనంతరం పురస్కారాల ప్రధానోత్సవం ఉంటుంది. పైన పేర్కొన్న నిర్ణయాలను ఇఫీ-2007 కార్యనిర్వాహక కమిటీ గైకొన్నది. భారత రెట్రాస్పెక్టివ్ విభాగంలో తపన్ సిన్హా, విజయానంద్ చిత్రాలు, నివాళి విభాగంలో సినిమాటోగ్రాఫర్ కేకే మహాజన్, నటి విమలాదేవి మరియు సంగీత దర్శకుడు ఓపీ నయ్యర్ చిత్రాలకు ప్రాధాన్యత ఉంటుంది.
కేఎస్ సేతుమహదేవన్ ఆథ్వర్యంలోని జ్యూరీ ఇండియన్ పనోరమాకు గాను 21 ఫీచర్ చిత్రాలు, 15 నాన్ ఫీచర్ చిత్రాలను ఎంపిక చేసింది. తొలిసారిగా టిక్కెటింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. చిత్రోత్సవానికి హాజరుకానున్న ప్రతినిధులు తాము చూడదలచుకున్న చిత్రాలకు ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.