వేణుమాధవ్ "ప్రేమాభిషేకం" షూటింగ్ ప్రారంభం
వేణుమాధవ్ హీరోగా నటిస్తోన్న ప్రేమాభిషేకం చిత్రం షూటింగ్ శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. శాలువ వేసుకున్న వేణుమాధవ్‌పై ముహూర్తపు షాట్ చిత్రీకరించారు. దీనికి దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా... లగడపాటి శ్రీధర్ స్విచ్చాన్ చేశారు. వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా వేణుమాధవ్ దాసరి చిత్రకథను ఇచ్చిన అంశాల్ని చెప్పుకొచ్చాడు... ఒకరోజు సరదాగా "స్టేట్‌రౌడీ" సినిమా ఆఫీసులో కూర్చుని హీరో శివాజీ, దర్శకుడు గాంధీ...నేను మాటల్లోపడ్డాం. రాజావన్నెంరెడ్డి చిత్రం "ఆదివారం ఆడవాళ్ళకు సెలవు" చిత్రం గురించి టాపిక్ వచ్చింది. ఈ చిత్రానికి డా. దాసరి నారాయణరావుగారు కథనివ్వడంతో మంచి హిట్ అయింది. అలాగే మరో ఇద్దరికి ఆయన కథలు ఇచ్చారని మాటల్లో తెలిసింది.
అందరికీ గురువుగారు కథలిస్తారు. మరి నాకెందుకివ్వరూ? అని అన్నాను. వెంటనే శివాజీ అందుకుని... నువ్వెళ్ళి అడిగితే "ప్రేమాభిషేకం" వంటి కథ ఇస్తారని అన్నాడు. అయితే ఇప్పుడే వెళతానని... వెళ్ళి కలిశాను. ఆరోజు ఆయన ఇంటిలోనే ఉన్నారు. అక్కడే అమ్మ (దాసరి పద్మ) కూడా ఉన్నారు. గురువుగారికి విషయం చెప్పి నాలాంటి వాడిక్కూడా ఓ కథ దానం చేయండన్నాను.
ఆయన నవ్వి... ఆలోచిస్తానని అన్నారు. మీరు మాట ఇవ్వకపోతే నేనిక్కడే ఉంటానని చెప్పాను. ఆ తర్వాత... ఆయన నవ్వి... నీకు ఎలాంటి కథ కావాలి? అని అడిగారు. నేను సడెన్‌గా తెలివీ ధైర్యంతో "ప్రేమాభిషేకం" లాంటి కథకావాలన్నాను. ఆ మాటకు మా అమ్మ దాసరి (పద్మ) కూడా వత్తాసు పలకడంతో తప్పకుండా ఇస్తాలే అని దాసరి అనడం... ఇక నేను తిరిగి వచ్చేయడం జరిగింది.
కొద్దిరోజులకు అర్థరాత్రి 11 గంటలకు లాండ్‌ఫోన్ వచ్చింది. ఈ టైమ్‌లో ఎవరబ్బా? అని రిసీవ్ చేశాను. దాసరి ఇంటి నుంచి మాట్లాడుతున్నాం. ఒక్కసారి ఇంటికి వస్తారా? అన్నది సారాంశం. తెల్లవారి వెళ్ళి కలిశా... మంచి కథ దొరికింది... నువ్వన్నట్లు టైటిల్‌కూడా "ప్రేమాభిషేకం". కానీ "వీడికి క్యాన్సర్ లేదు" అనేది కాప్షన్ అని చెప్పారు. నాకు ఎంతో ఆనందం వేసింది. ఎప్పుడో అడిగిన కథను ఇలా కొద్దిరోజులకే ఇస్తారను కోలేదని... ఆయనకు జన్మాంతం రుణపడి ఉంటానని వేణు వెల్లడించాడు.

ఈ చిత్రాన్ని వేణుమాధవ్ సోదరులు త్రివిక్రమ్, గోపాలకృష్ణలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వారికి మరో స్నేహితుడు జి. విజయ్‌కుమార్ గౌడ్ కూడా జతయ్యాడు. వీరందరి సహకారంతో తాను హీరోగా నటిస్తున్నానని, ఇందులో హీరోయిన్స్‌కు పెద్ద ప్రాధాన్యత ఉండదని వేణుమాధవ్ పేర్కొన్నారు. ఇందులో అద్భుతమైన పాత్రను శ్రీహరి పోషిస్తుండగా, మరో పాత్రను నాగబాబు పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ.... కామెడీలో మా ఇద్దరి మధ్య కాంపిటేషన్ ఉంటుందని వేణుమాధవ్‌నుద్దేశించి అన్నారు. తనపాత్ర చాలా సీరియస్‌గా ఉన్నా చూసేవాడికి కామెడీని తెప్పిస్తుందనీ, ఓ రౌడి వేషం వేస్తున్నానని చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన విజయ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ... శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై... నవంబర్, డిసెంబర్, జనవరిలలో షూటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. మార్చినెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
దాదాపు కమేడియన్స్ అంతా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: వాసు, కథ: దాసరి నారాయణరావు, మాటలు: రామస్వామి, ప్రవీణ్ వర్మ, శ్రీనివాసులు, వేణుమాధవ్, పాటలు: చంద్రబోస్, దర్శకత్వం: ఎస్. ఎస్. విక్రమ్ గాంధీ.