తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న "రెడీ"
రామ్, జెనీలియా జోడీగా శ్రీనువైట్ల దర్శకత్వంలో "స్రవంతి" రవికిషోర్ నిర్మిస్తున్న చిత్రానికి "రెడీ" అన్న టైటిల్ పెట్టారు. "దేనికైనా" అంటూ క్యాప్షన్‌ను జత చేశారు. "రెడీ" సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
ఇందులో ప్రముఖ తారాగణం పాల్గొనడంతో వారిమీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని ఆ వివరాలు తెలిపాయి. నవంబర్ 2వ తేదీ నుంచి తదుపరి షెడ్యూల్ ప్రారంభించి విశాఖ, అరకులో ఒకపాటను, మరిన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తామని నిర్మాత రవికిషోర్ చెప్పారు.
కోటశ్రీనివాసరావు, నాజర్, చంద్రమోహన్, తనికెళ్ళభరణి, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఎం.ఎస్.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్, బ్రహ్మాజీ, చిత్రం శ్రీను, శ్రీనివాసరెడ్డి, వేణు, సుధ, రజిత, సురేఖా వాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపి మోహన్, డైలాగ్స్: కోన వెంకట్, మ్యూజిక్: దేవీశ్రీ ప్రసాద్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ.