90 శాతం పూర్తయిన "బతుకమ్మ"
సింధుతులాని నాయికగా కాకతీయ ఫిలింస్ నిర్మిస్తోన్న "బతుకమ్మ" చిత్రం నవంబర్ 1వ తేదీతో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. వరంగల్ సమీపంలోని పలు ప్రాంతాల్లో 60 రోజులుగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు 90 శాతం షూటింగ్ పూర్తిచేసుకుందని చిత్ర దర్శకుడు టి. ప్రభాకర్ చెప్పారు.
ఈ సినిమాలోని ఐదు పాటల చిత్రీకరణ కూడా పూర్తయిందని ప్రభాకర్ అన్నారు. మరోవారం రోజుల పాటు హైదరాబాద్‌లో మిగిలిన షెడ్యూల్‌ను పూర్తిచేస్తామని ప్రభాకర్ తెలిపారు. ఈ నెలలో (నవంబర్) రెండవదఫా ఆడియోను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.
ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే కాకతాళీయంగా బతుకమ్మ పండుగ రావడం, షూటింగ్‌లో యూనిట్ పండుగ జరుపుకోవడం అక్కడివారి ప్రశంసలు పొందాయని అన్నారు. ఇప్పటివరకు షూటింగ్ జరగని మారుమూల ప్రాంతాల్లోనూ జరపడంతో అక్కడి ప్రజలు పూర్తి సహకారాలు అందించారు. బతుకమ్మగా సింధుతులాని పాత్ర చక్కగా అమరిందని...త్వరలో చిత్రాన్ని విడుదలచేయనున్నామని తెలిపారు.
సింధుతులాని మాట్లాడుతూ... ఈ సినిమాలో నటిస్తున్నానని తెలిసినప్పటి నుంచీ ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. నటిగా నా కెరీర్‌లో నిలిచిపోయే పాత్రను చేస్తున్న అనుభూతి కలుగుతోంది అన్నారు. తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన ఈ పండుగను అందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చిత్ర సమర్పకుడు టి. రాజేశ్వరరావు చెప్పారు.