వరుణ్ సందేశ్‌తో "కొత్త బంగారు లోకం"
"హ్యాపీడేస్" చిత్రంలోని నలుగురిలో ఒకడైన వరుణ్ సందేశ్‌ను హీరోగా పరిచయం చేస్తూ "దిల్" రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి "కొత్త బంగారు లోకం" అనే పేరును కూడా ఖరారు చేశారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఏడవ చిత్రంగా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి "ఆర్య", "బొమ్మరిల్లు", "ఠాగూర్" చిత్రాలకు దర్శకత్వశాఖలో పనిచేసిన శ్రీకాంత్‌ను దర్శకునిగా పరిచయం చేస్తున్నారు.
ఇందులో చాలావరకు కొత్తవారే నటిస్తారని దిల్ రాజు చెప్పారు. గురువారం మాదాపూర్‌లోని సంస్థ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... హీరో తండ్రిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారని... అతని తల్లిగా ప్రముఖ నటి నటిస్తోందని చెప్పారు. ప్రతీ కుటుంబంలో ఉన్న సమస్యల్లో ఒకదానిని ప్రదానంగా ఎంచుకుని చక్కని కథగా అల్లామని దిల్ రాజు వివరించారు.
అదీ సార్వజనీకమైన సమస్య అని... "హ్యాపీడేస్"ను చూస్తే ఎలా కాలేజీ డేస్ గుర్తుచేసుకుంటారో... అదేవిధంగా ఈ చిత్రం చూస్తున్నంతసేపు తమ కుటుంబాలను అన్వయించుకుంటారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
"బొమ్మరిల్లు" చిత్రంలో హీరో పాత్ర మెచ్చూర్డ్‌గా ఉంటే... ఈ చిత్రంలో కథానాయకుడు టీనేజ్‌లో ఉంటాడు. హీరోయిన్‌గా కొత్త అమ్మాయిని పరిచయం చేయబోతున్నామని అన్నారు. డిసెంబరులో షూటింగ్ ప్రారంభంకానున్న ఈ చిత్రంలోని మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి చేస్తామని దిల్‌రాజు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే. మేయర్.