1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

యోగి దర్శకత్వంలో గోపీచంద్

ఈతరం ఫిలింస్ అధినేత పోకూరి బాబూరావు గోపీచంద్‌తో 'ఒంటరి' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్
ఈతరం ఫిలింస్ అధినేత పోకూరి బాబూరావు గోపీచంద్‌తో 'ఒంటరి' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. బి.వి.రమణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తర్వాత గోపీచంద్ హీరోగా యోగి దర్శకత్వం వహించే మరో చిత్రంలో నటించనున్నారు. నాలుగేళ్ల క్రితం ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై 'ఒక రాజు ఒక రాణి' చిత్రానికి దర్శకత్వం వహించిన యోగి.. చాలా కాలం తర్వాత మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

ఈ చిత్రం ద్వారా తనలోని దర్శకత్వ ప్రతిభను నిరూపించుకోవాలనే గట్టి పట్టుదలలో యోగి ఉన్నారు. యజ్ఞం, రణం వంటి రెండంకెల చిత్రాల తర్వాత మూడంకెల టైటిల్స్‌పై గోపీచంద్ దృష్టి సారించినట్టు ఉన్నారు. ప్రస్తుతం 'ఒంటరి' చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత కొత్త చిత్రం ఆరంభం కావచ్చని ఫిల్మ్ నగర్ వర్గాల వినికిడి.
About Writer
PNR