తెలుగుపై దృష్టిసారిస్తానంటోన్న హేమశ్రీ
పరభాషల నుంచి తెలుగులోకి వచ్చి ఇక్కడే స్థిరపడాలనుకుంటున్న నటీమణుల్లో హేమశ్రీ ఒకరు. బెంగళూరుకు చెందిన హేమశ్రీ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. అప్పటికే డా. విష్ణువర్ధన్ చిత్రాల్లో అతనికి చెల్లెలుగా, కుమార్తెగా నటించానని పేర్కొంది. ప్రస్తుతం కన్నడలో "జిందగీ", "కీర్తి" చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించానని చెబుతోంది.
డా. విష్ణువర్ధన్‌తో నటించిన చిత్రాలను చూసి తనను గిరిబాబు ఎంపిక చేశారని ఆనందాన్ని వ్యక్తం చేసింది. "నీ సుఖమే నే కోరుతున్నా"లో సీనియర్ నటి స్నేహతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాననీ, మొదటి చిత్రంతోనే నటనలో చాలా మెళకువలు నేర్చుకున్నానని పేర్కొంది.
పాత్ర గురించి చెబుతూ.... రాజాను ఇష్టపడే పాత్ర తనదని, ముక్కోణపు ప్రేమకథా చిత్రమిదని వివరించింది. ఈ చిత్రం షూటింగ్‌లో ఉండగానే తనకు తెలుగులో ఆఫర్లు వస్తున్నాయని, కథ, బేనర్ పరగణిస్తానని అంటోంది. తమిళం, కన్నడ, తెలుగు భాషలు తనకు వచ్చునని డబ్బింగ్ తానే చెప్పుకుంటానని అంటోంది. తన తల్లి డాక్టర్ అని. తండ్రి వ్యాపారవేత్త అని చెబుతున్న హేమశ్రీ తెలుగులో నిలబడాలని ఆశిద్దాం.