మరో "శివరంజని" షూటింగ్ ప్రారంభం
అలనాడు దాసరి నారాయణరావు సారథ్యంలో రూపొందిన "శివరంజని" ఇంకా సినీప్రియుల మనస్సులో చెదరిపోలేదు. మళ్ళీ అదే పేరుతో సీతారామసాయి ఫిలిమ్స్ అనే సంస్థ కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. కార్తీక్, ఫరా, ఇషాన్, ప్రవళిక హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ...
కె. ప్రభాకరరావు నిర్మాతగా విజయరామారావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సోమవారం రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది. కృష్ణభగవాన్, అపూర్వ, కార్తీక్, ఫరా, ఇషాన్, ప్రవళికలపై ముహూర్తపుషాట్ చిత్రీకరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... విశాఖలోని మారుమూల గ్రామంలోని ఇద్దరు యువకులు, యువతులకథ ఇదని చెప్పారు. తమ కలల సాకారం కోసం అనేక కష్టాల్ని ఎదుర్కొని అటు జీవితంలోనూ, ఇటు ప్రేమలోనూ విజయం సాధించి యువతకు ఆదర్శం కావడమే ఈ చిత్ర నేపథ్యమని వివరించారు.
ఏకధాటిగా సాగే షెడ్యూల్తో చిత్రాన్ని పూర్తిచేస్తామని చెప్పారు. ఈ చిత్రం తమకు మంచి గుర్తింపు తెస్తుందని కార్తీక్, ఫరా, ఇషాన్, ప్రవళిక ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా అలీ, బ్రహ్మానందం, ప్రియ, రీనా, శ్రావణసంధ్య తదితరులు నటిస్తున్నారు.