1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పండుగల మధ్య ''లక్ష్యం'' శతదినోత్సవం

గోపీచంద్
గోపీచంద్, అనుష్క జంటగా నటించిన లక్ష్యం సినిమా శతదినోత్సవ వేడుక దసరా దీపావళి పండుగల మధ్య మరో పండుగలా జరిగింది. హైదరాబాద్‌లోని శిల్పాకళావేదికలో శనివారం రాత్రి ఘనంగా జరిగిన వేడుకలో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

శ్రీవాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) లక్ష్యాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా చిత్రవిజయానికి కృషి చేసిన చిత్రయూనిట్‌ను రామానాయుడు అభినందించారు. అనంతరం పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విజయం సాధించిన సినిమాలకు శతదినోత్సవం జరపవలసిన ఆవశ్యకతను ప్రస్తావించారు.

హీరో గోపీచంద్ నటన తనకు నచ్చిందని హిట్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. స్టార్ డైరక్టర్ల సరసన లక్ష్యం చిత్రదర్శకుడు శ్రీవాస్ చేరాలని హీరో ఎన్.టి.ఆర్ ఆకాంక్షించారు. గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని, సురేష్, ఇవీవీ. సత్యనారాయణ, జెమిని కిరణ్, కోట శ్రీనివాసరావు, చలపతిరావు, అనుష్క తదితరులు పాల్గొన్నారు.
About Writer
WD