1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఆయన వెరీ గ్రేట్... ఈయన జెంటిల్‌మెన్

ఆయన వెరీ గ్రేట్ ఈయన జెంటిల్‌మెన్
WD
'ఆయన వెరీ గ్రేట్... ఈయన జెంటిల్‌మెన్..' ఈ మాటలు అన్నది ఎవరో కాదండోయ్. లక్ష్మీ, తులసి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించిన అందాలతార నయనతార. విక్టరీ వెంకటేష్ పై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. ఇటీవల తులసి చిత్రం విడుదలైన సందర్భంగా నయనతార మాట్లాడుతూ, వెంకటేష్‌తో నటించటం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందనీ, ఆయన తనకు ఎన్నో మెలకువలు నేర్పారనీ, మొత్తంగా కలిసి ఆయన ఓ జెంటిల్‌మెన్ అనీ... చెపుతోంది.

అంతేకాదండోయ్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వెంట నటించాలన్న కోరిక తనకు ఉందనీ, ఆయన వెంట ఒకే ఒక్క సన్నివేశంలో నటించినా చాలని అంటోంది. ఎందుకంటే రజనీ వెరీ వెరీ గ్రేట్... ఆయనను మరొకరితో పోల్చటం సాధ్యమే కాదు అంటోంది. మరి మిగతా వారి గురించి భవిష్యత్తులో ఏమేం చెబుతోంది చూద్దాం.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT