పేరుమార్చుకున్న బాలీవుడ్ హాటెస్ట్ గర్ల్
|
ఇంతకీ ఆమె మార్చుకున్నది కొత్త పేరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. చిత్రసీమకు పరిచయమయ్యే భామలు తమ సొంత పేర్లను కాదని వేరే పేర్లు పెట్టుకోవడం ఆనవాయితీ. అయితే.. నిషా కొఠారీ మాత్రం..తొలుత కొత్త పేరు పెట్టుకుని చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ పేరు కలసి రాకపోవడంతో తాజాగా తన సొంత పేరుతోనే చిత్ర పరిశ్రమలో కొనసాగాలని నిర్ణయించుకుందట.
చిన్న వయస్సులోనే వెండితెరకు పరిచయం కావడం వల్ల ఏమీ అర్థం కాలేదు. సినీ పరిశ్రమలో ఒకే పేరుతో అనేక మంది ఉన్నపుడు నేను ప్రియాంక పేరుతో ఎందుకు కొనసాగరాదని ప్రశ్నించారు. సో.. ఇకపై నిషా కొఠారి.. ప్రియాంక కొఠారి అన్నమాట.