డబ్బింగ్ పూర్తి చేసుకున్న ''సింధూరి''
|
ఈ సందర్భంగా నిర్మాత రెడ్డప్పనాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈనెలలోనే ఆడియోను విడుదల చేస్తాం. అన్ని వర్గాలను మెప్పించే విధంగా ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ, సస్పెన్స్ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు.
ఇంకా ఈ చిత్రంలో కృష్ణభగవాన్, శివాజీరాజా, రామిరెడ్డి, కొండవలస, శరత్ బాబు, బ్రహ్మానందం, రఘునాథ రెడ్డి, అన్నపూర్ణ, మధుమణి, శోభ, అపూర్వ, అభినయశ్రీ తదితరులు నటిస్తున్నారు. ప్రసన్నకుమార్ సంగీత బాణీలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి వెల్లంకి దుర్గాప్రసాద్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు.