గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » శ్రీకాంత్, జగపతిబాబు కాంబినేషన్‌లో కొత్త చిత్రం
కథనాలు
Feedback Print Bookmark and Share
 
శ్రీకాంత్ హీరోగా మ్యాక్ మీడియా అండ్ బ్లూస్కై ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందిస్తోన్న చిత్రానికి "నగరం" అనే పేరు ఖరారైంది. సి.సి.శ్రీనివాస్ దర్శకుడిగా ఎం.అంజిబాబు, పి. కిషోర్‌బాబు నిర్మిస్తున్నారు. టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం రాత్రి మాదాపూర్ జయభేరి క్లబ్‌లో జరిగింది.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ... ఈ చిత్ర కథ వెరైటీగా రూపొందిందని చెప్పారు. ఈ చిత్రంలో జగపతిబాబు ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారని అన్నారు. నేను కూడా ఆయన చిత్రాల్లో ప్రాధాన్యత పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

జగపతిబాబు మాట్లాడుతూ... చిత్ర నిర్మాతలు రియల్ఎస్టేట్ రంగంలో ఉండగా పరిచయమని... వారు సినిమా తీస్తున్నారంటే ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కథలో ప్రత్యేక పాత్రను జగపతిబాబు పోషించడం... నా పాత్ర ఈ సినిమాకు హైలైట్ అవుతుందనే నమ్మకం ఉందని జగపతిబాబు అన్నారు.

చిత్ర సమర్పకుడు ఎం.వి. చౌదరి మాట్లాడుతూ... శ్రీకాంత్, జగపతిబాబుతో గత పది సంవత్సరాలుగా పరిచయముందని.. "ఖడ్గం" చిత్రం తర్వాత శ్రీకాంత్ మాస్ చిత్రాలు చేయగలడనే నమ్మకం కుదిరింది. ఆ తర్వాత ఫ్యామిలీ చిత్రాల్లో నటించడం ఆదరించడం జరగటంతో... ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌, జగపతిబాబు కాంబినేషన్‌లో తీయాలని ముందుకొచ్చామన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రాజమౌళి, బోయపాటి శ్రీను, డా. రాజశేఖర్, సి. కళ్యాణ్, కె.ఎల్. నారాయణ, చక్రి తదితరులు పాల్గొన్నారు.