1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మరాఠీలో రామానాయుడు కొత్త చిత్రం

మరాఠీ రామానాయుడు కొత్త చిత్రం
WD PhotoWD
దాదాపు భాషల్లో చిత్రాలు నిర్మించిన మూవీమొగల్ డా. డి. రామానాయుడు తాజాగా మరాఠీతో 10 భాషల్లోకి చేరారు. తెలుగులో హిట్ అయిన "ప్రేమించు" చిత్రాన్ని "మా జీ అయి" (మై మదర్)గా నిర్మిస్తున్నట్లు సోమవారం వెల్లడించారు. అక్టోబర్ 17న ప్రారంభించి ముంబైలో షూటింగ్ జరిపాననీ, ఈ నెల 16తో టాకీతోపాటు కొన్ని పాటల చిత్రీకరణ పూర్తయిందన్నారు.

రెండు పాటలను వైజాగ్‌లో తీయనున్నాననీ, మరాఠీ నటులు వైజాగ్ రావడానికి సిద్ధమయ్యారని తెలిపారు. తెలుగులో లయ పోషించిన పాత్రను దేవికపౌటౌడ, హీరోగా సుబ్‌దేబావి, లక్ష్మీ పాత్రను స్మితాజయకర్, మురళీమోహన్ పాత్రను రమేష్ భడ్‌కర్ పోషిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అచ్యుత్ ఠాగూర్, దర్శకత్వం: కాంచన్ నాయక్.
About Writer
Selvi