వెండితెర హనుమంతుడు అర్జా అస్తమయం
Publish: Tue, 13 Nov 2007 (16:45 IST)
Updated: Tue, 13 Nov 2007 (16:44 IST)
తెలుగు సినిమా అంటే.. తొలుత గుర్తుకొచ్చేవి పౌరాణిక చిత్రాలే. ఆంజనేయుని పాత్రలో అందరి మన్ననలు అందుకున్న అర్జా జనార్థనరావు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో తన స్వగృహంలో మరణించారు. 1956లో మిస్టర్ ఆసియా అవార్డును గెలుచుకున్న ఆయన ఎన్నో మరపురాని చిత్రాలలో నటించారు. ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం శ్రీరామాంజనేయ యుద్ధం. ఆ చిత్రంలో ఆయన పోషించిన ఆంజనేయ పాత్రకు అశేష తెలుగు ప్రేక్షకులనుంచి ఎన్నో ప్రశంసలు అందాయి. శంకరాభరణం, ముత్యాలముగ్గు, ఇల్లు-ఇల్లాలు, ఉండమ్మా బొట్టుపెడతా వంటి చిత్రాలలో ఆయన నటించారు. 1926లో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించిన ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT