25 ప్రింట్లతో విడుదలకు సిద్ధమైన "అమెరికన్ పోకిరి"
|
ఇటీవలే హిందీ, తమిళ, మలయాళం భాషల్లో కూడా అనువాదం చేసుకుంది. తెలుగులో ఈనెల 16న (శుక్రవారం) విడుదలవుతుందని చెప్పారు. "ఇ అండ్ టి" ఫిలింస్‌తో కలిసి ఈ చిత్రాన్ని విడుదలచేస్తున్నామని ఆయన అన్నారు. గతంలో ఈ సంస్థ "శంకర్‌దాదా జిందాబాద్" చిత్రాన్ని వైజాగ్, కృష్ణ, గుంటూరులలో హక్కులు పొంది రిలీజ్ చేసిందని వివరించారు.
"ఇ అండ్ టి" ఫిలింస్ ప్రతినిధి గురు మాట్లాడుతూ... ఆద్యంతం యాక్షన్ చిత్రమని... 90 నిమిశాల నిడివిలో 60 నిముషాల్లో యాక్షన్ ఉంటుందన్నారు. ఇటీవలే "పోకిరి" చిత్రాన్ని చూశాను. అందులోని ఛాయలు మా చిత్రంలోనూ కనిపించడంతో "అమెరికన్ పోకిరి" అనే పేరు పెట్టాం. మాజీ పోలీసు అధికారి కథతో ఈ చిత్రం రూపొందిందని... త్వరలో మరిన్ని తెలుగు సినిమాలు చేయనున్నామని గురు చెప్పారు.