నాగార్జున, విష్ణు చిత్రానికి టైటిల్ పెట్టండి!
|
పి. వాసు అద్భుతంగా సన్నివేశాలను చిత్రించాడు. నాజర్ మా బేనర్‌లో నటిస్తున్నాడని చెప్పారు. ఈ చిత్రానికి "కృష్ణార్జున", "కృష్ణార్జునులు", "మిత్రమా" అనే మూడు టైటిల్స్ అనుకున్నామని వెల్లడించారు. వాటిల్లో ఏది మీకు నచ్చిందో "విష్ణు స్పేస్ -123.తో 5600667కు ఎస్.ఎం.ఎస్ చేయండని మోహన్‌బాబు కోరారు. ఎంపికైన టైటిల్ రాసిన ఏడుగురికి ఆసక్తికరమైన బహుమతులను అందజేస్తామని ఆయన అన్నారు.
పి. వాసు మాట్లాడుతూ... విష్ణు క్యారెక్టప్ ఈ చిత్రంలో కొత్తగా ఉంటుందని అన్నారు. ఆయనలో మంచి నటుడు దాగిఉన్నాడని వెల్లడించారు. విష్ణు కెరీర్‌కు ఈ చిత్రం మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. నాగార్జునతో పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. నాజర్ మాట్లాడుతూ... మోహన్‌బాబు చిత్రంలో నటిస్తున్నానని అనగానే.. ఆయనది మిలటరీ క్రమశిక్షణ.. చాలా జాగ్రత్తగా ఉండాలని చాలామంది అన్నారు.
బయట విన్నదానికి ఇప్పుడు చూస్తున్న దానికి చాలా తేడా ఉంది. మోహన్‌బాబులో గొప్ప మానవతావాది ఉన్నాడని నాజర్ కొనియాడారు. పూర్తి "ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన చిత్రంగా ఉంటుందని ఆయన అన్నారు. మోహన్‌బాబుతో నటిస్తున్న రెండో చిత్రమిదని... కీరవాణి ఈ చిత్రానికి మంచి మ్యూజిక్‌ను అందించారని హీరోయిన్ మమతామోహన్‌దాస్ అన్నారు.