1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

బాలల చిత్రాలు చూసే అవకాశం తక్కువే: కిషన్

బాలల చిత్రాలు చూసే అవకాశం తక్కువ కిషన్
WD PhotoWD
15వ బాలల అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా ఐమాక్స్ కాంప్లెక్స్‌లో గురువారం ప్రదర్శించిన "కేరాఫ్ ఫుట్‌పాత్" (కన్నడ) చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిత్ర దర్శకుడు మాస్టర్ కిషన్ వయసు కేవలం తొమ్మిది సంవత్సరాలు మాత్రమే. చక్కటి సందేశాత్మక కథాంశంతో రూపొందిన ఈ చిత్ర విశేషాలను బాల దర్శకుడు వివరిస్తూ...

నేను మా నాన్నగారితో కలిసి కారులో వెళ్తున్నప్పుడు నాకు చాలా మంది వీధి బాలలు కనిపించారు. వాళ్ళు చదువుకోకుండా చిన్న వయసులోనే పనులు చేస్తూ జీవనాన్ని సాగిస్తుండేవారు. వారి జీవనశైలి గురించి నేను ఆలోచించి కథను తయారు చేసుకున్నాను.

దీని ఆధారంతో కథను తయారు చేసుకుని తల్లిదండ్రులకు వినిపించాను.... కథ నచ్చి సినిమా తీయడానికి వారు ముందుకొచ్చారని కిషన్ చెప్పారు. ఈ సినిమా కర్నాటకలో వందరోజులు ఆడింది. తమిళనాట యాభైరోజులు ఆడిందని... హిందీ భాషలో త్వరలో విడుదల కానుంది. తెలుగులో కూడా నాలుగునెలల తరువాత విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఈ సినిమా కొందరు అనాధ బాలలను ప్రభావితం చేసిందనే సమాచారం విన్నప్పుడు ఎంతో ఆనందంగా కిషన్ వెల్లడించారు. బాలకార్మిక వ్యవస్థకు విరుద్ధంగా పోరాటం చేయాలనుకుంటున్నానని... నా పుట్టినరోజును వారి మధ్య జరుపుకోనున్నానని కిషన్ అన్నారు.

ఇక చదువు విషయానికి వస్తే... నేను సినిమా షూటింగ్‌తో బిజీ బిజీగా ఉన్నా... చదువును పక్కన పెట్టకుండా డిస్టింక్షన్‌లో పాసయ్యాను. చిన్నపిల్లలు సినిమా చూసే విషయంలో వారికి స్వేచ్ఛలేదని భావిస్తున్నానని చెప్పారు. ఎందుకంటే తండ్రి తమ పిల్లలను యాక్షన్ చిత్రాలకు తీసుకెళితే.. తల్లి సెంటిమెంట్ సినిమాలకు తీసుకెళ్ళడంతో బాలల చిత్రాలు చూసే అవకాశం చాలా తక్కువగా వుంటోందని కిషన్ అభిప్రాయపడ్డారు.