బాలల చిత్రాల టీచర్
20 సంవత్సరాల క్రితం ఆమె టీచర్‌గా పనిచేశారు. అనంతరం టీచర్‌గా బాలలను దగ్గరగా గమనించి వారి మనస్తత్వాలను అధ్యయనంలో చేయడంలో ఫిన్‌లాండ్‌కు చెందిన కయ్యా యూరికళ విజయం సాధించారు. తాను సాగించిన అధ్యయనంతో రూపొందించిన బాలల చిత్రం 'వాలో' ఇజ్రాయిల్, ఇరాన్, గ్రీస్ పురస్కారాలు పొందిందని కయ్యూ యూరికళ ఆనందంగా చెప్పుకొచ్చారు.
'వాలో' చిత్రం శనివారం ఐమాక్స్ సినిమా ప్రాంగణంలో ప్రదర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వాలో చిత్రం ఒక డైరీ ఆధారంగా రూపొందించినట్లు తెలిపారు. ఫిన్‌లాండ్‌లో సినిమా స్టూడియోలు లేకపోవడంతో సహజమైన వాతావరణంలో చిత్రాలను నిర్మిస్తారని వెల్లడించారు. హైదరాబాద్‌కు రావడం తనకు ఎంతగానో ఆనందం కలిగించిందని, ఇక్కడ పాఠశాలలను సందర్శించినట్లు ఆమె తెలిపారు.