జీవోతోనే బాలల చిత్రాలకు జీవం: కుటుంబరావు
సినిమా థియేటర్లలో బాలల చిత్రాల ప్రదర్శనకు ప్రభుత్వం ఒక జీవోను వెలువరించాలని సినీదర్శకుడు,నిర్మాత అక్కినేని కుటుంబరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలలో భాగంగా కుటుంబరావు రూపొందించిన 'అమూల్యం' చిత్రం శనివారం ప్రదర్శించబడింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలల చిత్రాలను ప్రజలకు చేరువ చేయడంలో తలెత్తె సాదకబాధకాలను ప్రస్తావించారు.
ప్రతి శనివారం మరియు ఆదివారం సినిమా థియేటర్లలో బాలల చిత్రాలను మార్నింగ్ షోలుగా ప్రదర్శించేందుకు ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేయాల్సిన అవసరం ఉందని కుటుంబరావు అన్నారు. అలాగే ప్రతి పాఠశాలలోను నెలకొకసారి బాలల చిత్రాలను పిల్లలు తప్పనిసరిగా చూపించాలనే నిబంధనను అమలు చేయాలని ఆయన సూచించారు.
బాలల చిత్రాలకు సంబంధించిన స్పెషల్ షో నిబంధనలను సడలించాలని కుటుంబరావు కోరారు. నిబంధనలను సడలించినట్లయితే ఐదు రూపాయలకే పిల్లలకు బాలల చిత్రాలను చూపించే అవకాశం నిర్మాతలకు కలుగుతుందని ఆయన అన్నారు. తాను రూపొందించిన 'అమూల్యం' సినిమా ప్రదర్శన సమయంలో బాలల స్పందన తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చిందని కుటుంబరావు పేర్కొన్నారు.