"ఇదీ సంగతి" పేరుతో అబ్బాస్, టబుల చిత్రం
|
ఈ చిత్రంలో టబు పాత్ర అందర్నీ ఆకట్టుకుంటుందని అన్నారు. టాకీతో పాటు రెండు పాటల చిత్రీకరణ పూర్తయ్యిందని సిద్ధార్థ వెల్లడించారు. సంగీత దర్శకునిగా పరిచయమైన జాన్.పి.వర్కిన్ చిత్రంలోని ఐదుపాటలకు సంగీతం చక్కగా చేకూర్చారని చెప్పారు. ఇంకా మూడు పాటలను చిత్రీకరించి డిసెంబరులో పోస్ట్‌ప్రొడెక్షన్ కార్యక్రమాలను నిర్వహించి జనవరిలో సినిమాను విడుదల చేస్తామని అన్నారు.
ఇందులో రాజా కూడా ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారని... ఆయన సరసన మరోనటి నటించనుందని వివరించారు. ఈ చిత్రానికి కెమెరా: జె.కె. గుమ్మడి, కళ: నాగేంద్ర, పాటలు: చైతన్యప్రసాద్, పెద్దాడమూర్తి.