ఎన్నారైతో నటి ఆర్తీ ఆగర్వాల్ వివాహం
|
సురేష్ ప్రొడక్షన్ సంస్థ వెంకటేష్ హీరోగా నిర్మించిన "నువ్వు నాకు నచ్చావ్" చిత్రం ద్వారా తెలుగు వెండి తెరకు పరిచయమైన ఆర్తీ.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నంటించిన "ఇంద్ర", "నువ్వులేక నేను లేను", "అల్లరిరాముడు" వంటి పలు చిత్రాల్లో నటించింది. ఒక యువ హీరోతో ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెల్సిందే.
అయితే.. ఈ ప్రాణగండం నుంచి బయటపడిన ఆర్తీ.. కమెడియన్ సునీల్ హీరోగా నటించిన "అందాల రాముడు" చిత్రంలో నటించించింది. ఈ చిత్రం మంచి సక్సెస్ కావడంతో పాటు మరో చిత్రంలో నటించేందుకు ఆర్తీకి అవకాశం వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆమె ఒక ఎన్నారైను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని తనపై వచ్చిన ప్రేమ వదంతులకు ఫుల్‌స్టాఫ్ పెట్టింది.