1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

గ్లామర్‌ కోసమే ఎక్స్‌పోజింగ్: ప్రియమణి

గ్లామర్‌ ఎక్స్‌పోజింగ్ ప్రియమణి
FileFILE
పెళ్లైన కొత్తలో, యమదొంగ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి ప్రియమణి. రెండు చిత్రాల్లో ఎంతో ఒద్దికగా నటించిన ప్రియమణి, వాస్తవంలో మాత్రం అమాయకత్వపు అమ్మాయి మాత్రం కాదండోయ్. ఇటీవల తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన చిత్రం భయ్యాలో మంచి ఎక్స్‌పోజింగ్ చేసింది.

ఈ విషయాన్ని ప్రియమణిని అడిగితే ఏ.. నేను మాత్రమే చేస్తున్నానా ఎక్స్‌పోజింగ్, బాలీవుడ్ సినిమాలు మీరు చూడలేదా.. అంటూ కోపగించుకుంది... తనకీ మధ్య గోవాలో జరుగనున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు రావాలని ఆహ్వానం అందడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది. అలాగే తాను ఎక్స్‌పోజింగ్ చేయడానికి కారణం గ్లామరస్‌గా కనిపించడం కోసమేనని తిప్పుకుంటూ చెబుతోందీ తిప్పులాడి..

అయితే తనకు ఇన్ని విజయాలు వచ్చినా ఎలాంటి ఆహం తనను చేరదని, అందరినీ నవ్వుతూ పలుకరించడం తనకలవాటని చెబుతోంది. తనకీ అలవాటు చిన్నప్పటి నుంచీ ఉందని, చిలపిగా ఉండడం ఇష్టమని తెగ నవ్వుతూ చెప్పింది. వామ్మో ఇలాగైతే ఇంకేమన్నా ఉందా.. సరేలే చిలిపి ప్రియమణి కీప్ ఇట్ అప్.
About Writer
Hanumantha Reddy