నిఖిత, రాజాల సరదా సరదా ముచ్చట్లు
|
ఇంత వరకు బాగానే ఉంది గాని, అమ్మడుకి తెలుగు బాగా నచ్చినట్లుంది. తెలుగు మాట్లాడటానికి ప్రయత్నిస్తోంది. హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనర్ఘలంగా మాట్లాడే ఈ తరుణి మరి ఇప్పుడు తెలుగు నేర్చుకుంటోంది. ఏం చేస్తుందో ఏమో అనుకుంటున్నారంతా... ఇదిలా ఉంటే మరో వైపు మహారాజశ్రీ చిత్రం షూటింగ్ తర్వాత శ్రీహరి ప్రధాన పాత్రలో నటిస్తున్న భద్రాద్రిలో రాజా సరసన నటిస్తోంది.
ఇక్కడే ఉంది అసలు తమాషా.... సాధారణంగా హీరోలు షూటింగ్ సమయాల్లో హీరోయిన్‌లతో సరదాగా ఉండడం సహజం. ఇలాగే నిఖిత, రాజాల మధ్య కొన్ని తమాషా సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఒకటేంటంటే.. ఓ రోజు షూటింగ్ సమయంలో రాజా వచ్చి నిఖిత నేను సింగపూర్‌లో ఏడు రోజుల పాటు ఉండటానికి వెళ్తున్నాను నాతో నువు వస్తే అక్కడ కొన్ని సినిమా ఛాన్స్‌లు కూడా ఇప్పిస్తానని అడగ్గా... ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్న నిఖిత అమ్మో నీతో ఏడు రోజులు వస్తే ఏడు నెలల కొడుపుతో తిరిగి రావల్సి ఉంటుందని సమాధానమిచ్చింది.
కంగుతిన్న రాజా తెలుగు నేర్చుకుని ఎంత పని చేశావ్... అదే మాట నువు ఇంగ్లీషులో మాట్లాడి ఉంటే చాలా మందికి అర్థం అయ్యేది కాదు గదా అని ఆ మేటర్‌కు అక్కడితో స్టాప్ చేశాడు. అదండీ సంగతి హీరోహీరోయిన్‌ల మధ్య సరదా సరదా సంగతులు అలా ఉంటాయి మరి...