"అనసూయ"గా "ఖుషి" భామ
|
టీవీ రిపోర్టర్‌కు ఉండాల్సిన లక్షణాలు, అందం, ఆలోచనలు ఆమెలో పుష్కలంగా ఉండటంతో ఉద్యోగం వస్తుంది. తన ఉద్యోగ నిర్వహణలో ఆమెకు ఎదురైన అనుభవాల సమూహారమే ఈ చిత్ర కథ అని వివరించారు. అనంతరం చిత్ర హీరోయిన భూమిక మాట్లాడుతూ.. నా కెరీర్‌కు ఓ సవాల్ లాంటి పాత్రను పోషిస్తున్నాను. నాతో పాటు.. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను.
కుటుంబ కథలకు భిన్నంగా సాగే కథ, కథనాలు ఉంటాయని, ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర సమర్పకుడు సురేష్ బాబు వెల్లడించారు. ఇంకా ఈ చిత్రంలో నిఖిత, అంకిత, హర్షవర్థన్, మేల్కొటే, రవిబాబు, రేవతి తదితరులు నటిస్తున్నారు.