1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"కృష్ణార్జున"లుగా యువసామ్రాట్, విష్ణు

పి.వాసు దర్శకత్వంలో నాగార్జున
సరైన కథ లభించినట్టయితే.. "మిత్రమా" అనే టైటిల్‌తో చిత్రాన్ని చేస్తామన్నారు. ఈ చిత్రంలో నటించేందుకు అడిగిన వెంటనే నాగార్జున గారు అంగీకరించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక ఫాంటసీ చిత్రం. ఇందులో నేను సూపర్ హీరోగా చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి వెండితెరపై చూసే హీరోలతో నిజ జీవితంలో కలసి నటించడం చాలా ఆనందంగా ఉందని విష్ణు అన్నాడు.

ఈ చిత్రంలో మమతా మోహన్ దాస్ ఒక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం పాటలను త్వరలోనే విడుదల చేస్తామని, షూటింగ్ 90 శాతం మేరకు పూర్తయిందని దర్శకుడు వాసు వెల్లడించారు. కృష్ణార్జునులు ఎవరు? అసలు వారికి వీరికి ఏమిటి సంబంధం అనే సస్పెన్స్‌ను వీడేందుకు వచ్చే జనవరి లేదా ఫిబ్రవరి వరగు వేచి చూడాల్సిందేనని వాసు చెప్పారు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి