"మా ఆయన చంటి పిల్లాడు" అంటున్న మీరా
|
అనంతరం దర్శకుడు రాజా మాట్లాడుతూ.. మూడేళ్ళ క్రితం ఈ చిత్రాన్ని చూసి, తెలుగులో తీయాలనుకున్నాం. కానీ కుదరలేదు. మళ్లీ ఇన్నేళ్లకు ఇదే కథ నాకు దక్కడం అదృష్టంగా ఉంది. ప్రతి మహిళ తన భర్తకు భార్యలా, అమ్మలా, చెల్లెలులా, ప్రేయసిలా సేవలు చేస్తూ తన ఔన్నత్యాన్ని చాటుతుంది.
అందుకే ఈ చిత్రానికి సరిపడ టైటిల్‌ను పెట్టాం. మిగిలిన షూటింగ్‌ను డిసెంబరులో పూర్తి చేస్తామన్నారు. ఈ చిత్రంలో వేణు మాధవ్, చంద్రమోహన్, షకీలా, నిషా తదితరులు నటిస్తుండగా, మూలకథ.. రాజశేఖర్, మాటలు.. రాజేంద్ర కుమార్, పాటలు.. భాస్కర భట్ల, సంగీతం.. శ్రీలేఖ, కెమెరా.. వాసు, సహనిర్మాత.. ప్రశాంత్.