1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఆకాష్ హీరోగా "నవతరం"

దేవీ మూవీస్ సంస్థ
WD PhotoWD
దేవీ మూవీస్ సంస్థ "నవతరం" అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఆకాష్, సుహాసిని, ఆర్.బి.శ్రీరామ్, శ్రేష్ట హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. డి.రాజేష్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎన్.జె.రత్నావత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. చిత్రం షూటింగ్ సోమవారం అన్నపూర్ణా స్టూడియోస్‌లో ప్రారంభమైంది.

ఈ చిత్రంపై నిర్మాత రత్నావత్ మాట్లాడుతూ.. సమాజం కొత్త పుంతలు తొక్కుతున్నా పిల్లలకు కన్న తల్లిదండ్రులపై ప్రేమానురాగాలు ఏమాత్రం తగ్గడం లేదు. మారకూడదు. ముఖ్యంగా.. పెద్దల్ని ఎలా గౌరవించాలి అన్నది ఈ చిత్రంలో చక్కని సందేశం ఇస్తున్నాం. నేటి తరానికి చెందిన కథ అని అన్నారు.

దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ.. ప్రేమ, సెంటిమెంట్, కామెడీ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. "దూరపు కొండలు నునుపు" అన్న చందంగా కాకుండా.. మ
WD PhotoWD
దేశాన్ని మనమే బాగుచేద్దాం అనే సూత్రంతో తాపత్రయపడే యువతకు చెందిన కథ ఇతి.

మొత్తం ఎనిమిది పాటలు ఉంటాయనీ, మెలోడీ, ఫాస్ట్, ఫోక్ అన్ని ఇందులో ఉంటాయని సంగీత దర్శకుడు నరిరాజ్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా.. కె.జగదీష్, మాటలు.. గురుచరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. మోహన్, శ్రీదేవి పరార్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. డి.రాజేష్.
About Writer
PNR