1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

కొత్త నటీనటులతో "లవ్ 4 ఎవర్"

గతంలో
WD PhotoWD
గతంలో "ప్రేమించుకుందాం..రా!", "బావగారూ బాగున్నారా..!", "శంకర్‌దాదా ఎంబీబీఎస్" లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు జయంత్ సి.పరాన్జీ నూతన తారాగణంతో ఓ కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన కుర్రాడు రణదీప్, ముంబైకు చెందిన షలీనా అనే నూతన తారలతో తీస్తున్న ఈ చిత్రానికి "లవ్ 4 ఎవర్" అనే టైటిల్‌ను పెట్టారు. తెలుగు, హిందీ భాషలలో నిర్మితంకానున్న ఈ చిత్రాన్ని లాఫింగ్ వాటర్ ఎంటర్‌టైన్మెంట్ అనే నూతన సంస్థ నిర్మిస్తోంది.

ఈ చిత్రం ద్వారా తెలుగు వెండి తెరకు ముంబైకి చెందిన రామ్ సంపత్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో సోమవారం ప్రారంభమైంది. ఈ చిత్రం గురించి జయంత్ మాట్లాడుతూ.. కొత్త నటీనటులతో చేస్తున్న చిన్న సినిమా ఇది. కానీ పెద్ద హృదయం ఉన్న చిత్రం. జీవితంలో మరణం, ప్రేమ అనేవే సత్యాలు. మిగతావన్నీ అబద్ధాలు. వీటి నేపథ్యంలోనే చిత్రం నడుస్తుంది.

ఈ నాటి ట్రెండ్‌కు తగినట్టుగానే టైటిల్‌ను ఖరారు చేశాం. ఈ చిత్రం షూటింగ్‌ను డిసెంబరులో ప్రారంభించి. జనవరిలో పూర్తి చేస్తామన్నారు. మొత్తం ఐదు పాటలు ఉంటాయని, వీటిని న్యూజిలాండ్‌లో చిత్రీకరించనున్నట్టు చెప్పారు. లోగడ పెద్ద హీరోలతో చేసి ఇపుడు చిన్న హీరోలతో చేయడానికి కారణం కథే. ఆదరణ పొందిన ఏ చిత్రమైనా పెద్ద చిత్రం కిందే లెక్క అని జయంత్ పరాన్జీ అన్నారు.

ఈ చిత్రానికి కెమరా రాజామది, ఆర్ట్.. కృష్ణమాయి, కథ, స్క్రీన్ ప్లే.. అన్వితాదత్, ఎడిటింగ్.. మార్తాండ్ కె. వెంకటేష్, సహ నిర్మాత.. సుమంత్ పరాన్జీ, నిర్మాత, దర్శకత్వం.. జయంత్ సి.పరాన్జీ.
About Writer
PNR