1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

జై చిరంజీవ....

మెగాస్టార్ యజ్ఞయాగాదులు క్షుద్ర పూజలు
WD
మెగాస్టార్ అయినా సామాన్యుడే కదా. పొగడ్తలు, ప్రశంసలు వచ్చినట్లే.. విమర్శలు, అపవాదులు వస్తాయి. అందుకే చెడుని నివారించేందుకుగాను ఆయన యజ్ఞయాగాదులుపై దృష్టి సారించారని భోగట్టా. సినిమాలో నటించాలన్నా మంచి ముహూర్తాలు చూసుకునే ఇండస్ట్రీలో ప్రతిదీ సెంటిమెంట్‌పై ఆధారపడి ఉంది. అలనాడు ఎన్.టి.ఆర్ ఒక దశలో క్షుద్ర పూజలు చేసేవారని వార్తలు వచ్చాయి.

తాజాగా చిరంజీవి అంత చేయకపోయినా తనకు నరఘోష బాగా ఉందని, తన సన్నిహితులు వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. అందుకే ఆయన అభిమానులంతా కొన్నిచోట్ల యేలినాటి శని తమ మెగాస్టార్‌కు పోవాలనీ, తమ అభిమాన స్టార్‌కి అన్నింటా జయం కలగాలని వారు భగవంతునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి కూడా ఇంటిలో నరఘోష నివారణ యంత్రాలు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.

ఈర్ష్య, ఓర్వలేనితనం వంటివాటి వల్ల మనిషికి నరదృష్టి బాగా తగులుతుందని సన్నిహితులు చెప్పినమాట ప్రకారం ప్రస్తుతం వాటి నివారణకు యజ్ఞం చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.... చిరంజీవి నటించబోయే తదుపరి చిత్రంలో తన ఇమేజ్‌ను డామేజ్ చేసే వ్యక్తుల్ని బేస్ చేసుకుని కథను తయారు చేయాలని ఇండస్ట్రీలో పెద్ద రచయితలకు సూచించినట్లు తెలిసింది. మరి ఆ చిత్రం రిలీజ్ తర్వాత ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT