కమేడియన్ వివేక్ హీరోగా కొత్త చిత్రం
|
ఫస్ట్ ఫ్రేం పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం అరవిందరెడ్డి, కేశ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లక్ష్మీ రవీందర్ సమర్పిస్తున్న ఈ చిత్రంలో వివేక్, అశ్విన్ హీరోలుగా నటిస్తుండగా, రాజాబాబు చిత్రం ఫేమ్ శ్రీదేవిక హీరోయిన్‌గా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సమర్పకులు లక్ష్మీ రవీందర్ మాట్లాడుతూ కెమెడియన్‌గా తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన వివేక్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారని స్పష్టం చేశారు. అయితే ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేయలేదని తెలిపారు.
ఈ చిత్రానికి ఇమాన్ అందించిన పాటలు ఎంతో బాగున్నాయని, అలాగే ఈ చిత్రం పూర్తిగా చక్కని ఎంటర్‌టైనమెంట్‌గా సాగుతుందని తెలిపారు. పెళ్లయిన కొత్తలో జంటలు ఎలా ఉంటే వారి కాపురాలు కలకాలం పచ్చగా సాగుతాయనే దానిపై చిత్రం సాగుతుందని చెప్పారు. తప్పక ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించగలదని ధీమా వ్యక్తం చేశారు.