1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సమయ పాలనతో సుఖమయ జీవనం: ఐష్

ఇటు పుట్టింటి
FileFILE
ఇటు పుట్టింటి, అటు అత్తింటి వారితో గడపాలనుకునే వారు.. సమయపాలను ఖచ్చితంగా పాటించాల్సివుంటుందని మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా బచ్చన్ అంటున్నారు. 1994లో ప్రపంచ సుందరిగా ఎన్నికైన ఈ ముద్దుగుమ్మ... "ఔర్ ప్యార్ హోగయా" చిత్రంతో బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 'దేవదాస్', 'హమ్ దిల్ దే చుకే సనమ్', 'థూమ్-2', 'గురు' వంటి బాక్సాఫీస్ హిట్ చిత్రాల్లో ప్రధాన కథానాయిక పాత్రలను పోషించింది. తాజాగా.. 'సర్కార్ రాజ్', 'జోధా అక్బర్', 'పింక్ పాంథర్-2' చిత్రాల్లో ప్రధాన పాత్రలను పోషించనుంది.

ఈ నేపథ్యంలో లాంజిల్స్ అనే గడియారాల కంపెనీ ఉత్పత్తులను ఐష్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా "కుటుంబ అనుబంధం"పై తన మనస్సులోని భావాలను వెల్లడించింది. సాధారణంగా.. యువతీయువకులకు వివాహానికి ముందు ఎలాంటి బాధ్యతలు తెలియని, వివాహానంతరం వీటి భారాన్ని మోయాల్సి వస్తుంది. ప్రస్తుత ఆధునికయుగంలో క్షణం తీరిక లేకుండా ఎంతోమంది జీవనం సాగిస్తున్నారు.

అందులో నేనూ ఒకదాన్ని. నా జీవితంలో క్షణాలు, గంటలు, రోజులు ఇంత బిజీగా మారుతాయని ఊహించలేదు. ఇలాంటి తీరిక లేని జీవితం కోసం నేను ఒక పరిష్కార మార్గాన్ని ఎన్నుకున్నాను. పుట్టింటి, మెట్టింటి వాళ్లతో పాటు... దాంపత్య జీవితానికి సమయపాలను ఖచ్చితంగా పాటించాల్సి వుందన్నారు. ఇది తనలాంటి ఎంతో మందికి అత్యంత ముఖ్యమని ఈ మాజీ విశ్వసుందరి అంటోంది.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి