''ప్లేబోయ్ సుందరి'' మల్లికకు కిరీటం దక్కేనా...!
Publish: Sat, 8 Dec 2007 (10:35 IST)
Updated: Sat, 8 Dec 2007 (10:35 IST)
ఇటీవలి కాలంలో బాలీవుడ్ నటీమణులు అంతర్జాతీయ స్థాయిలో "మిణుగురు పురుగు"లా తళుక్కున మెరుస్తున్నారు. మొన్న.. శిల్పాశెట్టి, నిన్న.. బిబాసా బసు, నేడు.. మల్లికా షెరావత్. వీరిలో శిల్పాశెట్టి 'బిగ్ బ్రదర్ షో' విజేతగా నిలువగా.. 'సెక్సీయెస్ట్ ఉమెన్ ఆఫ్ ది ఏషియన్'గా బిబాసా బసు ఎన్నికైన విషయం తెల్సిందే. ఆ కోవలోనే వచ్చే ఏడాది నిర్వహించే సెక్సీయెస్ట్ పోటీల జాబితాలో మన మల్లిక చోటు సంపాదించుకుంది. ఈ ముగ్గురు అందగత్తెలు.. తమ అందచందాలతో అంతర్జాతీయ సినీ ప్రేమికులను ఆకట్టుకుంటున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది నిర్వహించే ఈ పోటీల కోసం ఇప్పటి నుంచే ముద్దుగుమ్మల ఎంపికలో అంతర్జాతీయ సంస్థ నిమగ్నమైంది. ఇందుకోసం ఒక ఆన్‌లైన్ సర్వే కూడా నిర్వహించింది. మొత్తం 200 మంది ముద్దుగుమ్మల పేర్లు ఉంచి సర్వే నిర్వహించగా 85 లక్షల ఓటర్లు స్పందిచారు. 200 మందిలో 99 మందిని ఎంపిక చేశారు. వీరిలో మన మల్లికకు 78వ స్థానం దక్కింది. "ప్లేబోయ్ సుందరి"గా తన అందచందాలతో సినీ అభిమానులకు మత్తెక్కించే ఈ సుందరికి సెక్సీయెస్ట్ కిరీటం దక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే.