1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మా ఆయన యోగా నేర్పుతున్నాడు: భూమిక

భూమికా చావ్లా
FileIFM
తనకు పెళ్లయినా లేడీ ఓరియెంటెడ్ పాత్రలే వస్తున్నాయనీ.... ఒకవేళ ఇవి కూడా రాకపోతే వేరే వృత్తిలో కొనసాగుతానంటోంది భూమిక. మిస్సమ్మ, సత్యభామ, అనసూయ, మాయాబజార్ వంటి చిత్రాల్లో తన పాత్రే కీలకమైందని చెప్పింది.

మీరు ఏ సినీ పరిశ్రమకు అధిక ప్రాధాన్యత ఇస్తారు అన్న ప్రశ్నకు... పక్షి ప్రపంచంలో ఎక్కడైనా విహరిస్తున్నట్లే.... తాను ఇండియాకు సంబంధించి అన్ని భాషల చిత్రాల్లోనూ నటిస్తున్నాననీ, ఇవాళ టాలీవుడ్‌లో ఉంటే రేపు బాలీవుడ్‌లోనూ ఎల్లుండి కోలీవుడ్‌లోనూ ఉంటానని చెప్పుకొచ్చింది. ఎక్కువ చిత్రాలు తెలుగులో చేసినప్పటికీ తనకు ఇంకా తెలుగు పూర్తిగా రాలేదనీ, త్వరలోనే నేర్చుకుంటాననీ అంటోంది.

వైవాహిక జీవితం గురించి అడిగిన ప్రశ్నకు... ప్రస్తుతం తన భర్త వద్ద యోగా నేర్చుకుంటున్నానంది. అంతేకాదండోయ్... భూమికకు కవిత్వం అంటే మహా ఇష్టమట. ఇప్పటికే సుమారు 70 కవితలు రాశాననీ, వాటిని జావెద్ అక్తర్‌కు చూపించి పుస్తకం వేస్తానని చెప్పింది. హిందీలో సరే... మరి తెలుగు మాటేమిటో... ఆ సంగతి ఈసారి అడుగుదాం....
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT