"వానొస్తే వర్షాకాలం" అంటున్న నరేష్-ఫర్జానా
|
హీరో-హీరోయిన్లపై డాన్స్ మాస్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో రెండు పాటలను చిత్రీకరించారు. 'యమ యమాగ ముద్దిస్తావని', 'వానొస్తే వర్షాకాలం' అనే పాటలను నరేష్-ఫర్జానాలపై బెల్లీ డాన్సర్స్ పాల్గొనగా పాటల చిత్రీకరణ పూర్తి చేశారు.
తదుపరి షెడ్యూల్‌ను ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు రాజమండ్రి, అరకు తదితర పరిసరాల్లో చిత్రీకరిస్తామని నిర్మాత అమ్మిరాజు తెలిపారు. పూర్తి వినోదభరితంగా సాగే ఈ చిత్రం ప్రముఖ దర్శకుడు ఇవివి.సత్యనారాయణ సమర్పణలో రూపుదిద్దుకుంటోంది.
