"రాజకీయ చదరంగం"లో క్లైమాక్స్ ఉండదు: సిసిరెడ్డి
|
చిరంజీవి కొత్త పార్టీ ఏర్పాటుపై వస్తున్న ఊహాగానాలపై సిసిరెడ్డి స్పందిస్తూ.. నాకు మెగాస్టార్ మరీ సన్నిహితం కాకపోయినా.. ఆయన గురించి బాగా తెలుసు. శాంత స్వభావి. నిగర్వి. సినీ రంగంలో బాగా కష్టపడి పైకొచ్చారు. అలాగే రాణించారు. రాణిస్తున్నారు కూడా. కథకు అనుగుణంగా తన నటనను ప్రదర్శించి కోట్లాది మంది అభిమానులను దరిచేర్చుకున్నారు.
అయితే.. ఆయన రాజకీయ ప్రవేశం చేస్తే పరిస్థితి పూర్తి భిన్నంగా వుంటుంది. మంత్రి పదవి లభించని వారు, ఇతరాత్రా లాభాలు లేనివారు వ్యతిరేకులవుతారు. సినిమాల్లో తప్పు జరిగితే వెంటనే ఎదిరించేందుకు, ఫైట్స్ చేసేందుకు డూప్స్ సిద్ధంగా ఉంటారు. మరి ఇక్కడ? పూర్తి విరుద్ధం.
కష్టాల్లో చిక్కుకుంటే ఆదుకునేందుకు ఎవరూ దగ్గరకు రారు. డూప్స్ ఉండరు. చుట్టూ శత్రువులే చేరుతారు. ప్రతికూలురు, అనుకూలురు, అవినీతిపరులు మాత్రమే ఉంటారు. వారిని నియంత్రించేందుకు సరైన స్క్రిప్ట్, క్లైమాక్స్ అనేవి ఈ "రాజకీయ చదరంగం"లో ఉండవని సిసి రెడ్డి అభిప్రాయపడ్డారు.