1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నా కళ్లే నా ప్లస్ పాయింట్స్

దీపికా పడుకునె బాలీవుడ్ సెక్సీ రాణి ఓం శాంతి ఓం
FileFILE
చారిడేసి కళ్లు... ముత్యాల్లాంటి పలువరుస... ఆకర్షణీయమైన శరీరాకృతి.... బాలీవుడ్ క్వీన్ దీపిక సొంతం. దీపిక అంటే ఎవరో.... అని అడిగేవారు బహుశా ఉండకపోవచ్చు. 'ఓం శాంతి ఓం' చిత్రం ద్వారా భారతీయ వెండితెరకు పరిచయమైన ఈ సెక్సీ రాణి తనకంటూ కొన్ని ప్రత్యేకమైన ఇష్టాలున్నాయని అంటోంది. అచ్చమైన భారతీయ మహిళ ధరించే దుస్తులంటే పడుకునెకు అత్యంత ప్రీతిపాత్రం.

పాశ్చాత్య మోడళ్లను అంతగా ఇష్టపడనని చెప్పినప్పటికీ జీన్స్, టీషర్టులు వేసుకోక తప్పటం లేదని బాధపడుతోంది. మరోవైపు చిత్రంలో పాత్రకు తగ్గట్లు దుస్తులను ధరించి తీరాల్సిందే కదా అని గ్లామర్ ప్రదర్శనకు రెడీ అని పరోక్షంగా చెపుతోంది. అంతేకాదండోయ్ ఐశ్వర్యారాయ్ తర్వాత అంతటి చురుకైన చూపులను కలిగిన ఈ సుందరి, తనకున్న అందమైన కళ్లే తన ప్లస్ పాయింట్స్ అంటోంది.

అందుకే అనునిత్యం కళ్లు మరింత ఆకర్షణీయంగా కనిపించటంకోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటానని చెపుతోంది. తనకు ఇష్టమైన మెను ఏదని అడిగితే... ఏమాత్రం తడుముకోకుండా 'దక్షిణాది వంటకాలంటే భలే ఇష్టం' అని చటుక్కున చెప్పేసింది. ఇకనేం తదుపరి మకాం టాలీవుడ్‌లోనేనన్నమాట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT