ఉత్తమ గేయ రచయితగా వనమాలి ఎంపిక
|
ఈయన రచించిన 'వలసపోయిన మనసులు' అన్న కవితకు జాతీయ కవిగా వనమాలికి గుర్తింపు నిచ్చింది. 2008, జనవరిలో నాగపూర్‌లో జరిగే జాతీయ కవుల సదస్సు కార్యక్రమంలో వనమాలి ఈ పురస్కారాన్ని అందుకుంటారు.
అంతేకాక జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా వనమాలి రచించిన ఆ మహా కావ్యాన్ని అన్ని భారతీయ భాషల్లోకి అనువదిస్తారని ఆకాశవాణి వర్గాలు తెలిపాయి. అలాగే వివిధ ఆకాశవాణి కేంద్రాల ద్వారా ఈ కావ్యాలు దేశమంతటా ప్రసారం కానున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
వనమాలి గతంలో సినీరంగంలోనే కాక సాహిత్యరంగంలో డా. మణిగోపాల్‌గా మెరీనా అన్న పేరుతో కవ్యాన్ని వెలువరించారు. దీంతో అప్పట్లోనే ఈయనకు ఉత్తమ పాత్రికేయునిగా సైతం సినీగోయర్స్ అవార్డును అందుకున్నారు.
యువతను ఆకట్టుకునే రీతిలో ఉండే ఈయన కవితలు.. ఇటీవల హ్యాపీడేస్, టైమ్, శివపుత్రుడు, చందమామ వంటి చిత్రాల ద్వారా అర్ధమవుతాయి. జాతీయ కవి గౌరవస్థానాన్ని అలంకరించిన సందర్భంగా ఆయనను పలుకరించగా బాధ్యత పెరిగిందని, ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకెళ్తానని చిరునవ్వు వదనంతో సమాధానమిచ్చారు...