"కృష్ణ"గా వస్తున్న రవితేజ
Publish: Mon, 24 Dec 2007 (12:48 IST)
Updated: Mon, 24 Dec 2007 (12:48 IST)
రవితేజ, త్రిష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి 'కృష్ణ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'ది పవర్ ఆఫ్ ఇంద్రకీలాద్రి' అని ఉప శీర్షికగా పెట్టారు. లక్ష్మీనరసింహా విజువల్స్ పతాకంపై బి.కాశీ విశ్వనాథం నిర్మాత. డివివి.దానయ్య సమర్పణలో రూపొందుతున్న ఈచిత్రానికి వివి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విశేషాలపై నిర్మాత మాట్లాడుతూ.. రవితేజ చిత్రాల్లోకెల్లా ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతోందన్నారు. బెజవాడ బ్యాక్ డ్రాప్‌లో రూపొందే కథ. రవితేజ నటన, వినాయక్ దర్శకత్వం హైలెట్ అవుతుందని చెప్పారు. దానయ్య మాట్లాడుతూ.. ఈ నెల 27వ తేదీన ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయనున్నట్టు చెప్పారు. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని వచ్చే నెల పదో తేదీన విడుదల చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. వినోదం, యాక్షన్ అంశాలుగా ఈ చిత్రం రూపొందుతోన్న ఈ చిత్రానికి కెమెరా ఛోటా కె.నాయుడు, సంగీతం.. చక్రి. ఫైట్స్.. రామ్‌లక్ష్మణ్, మాటలు.. ఆకుల శివ.