నిరాశ సహజమైంది: తమన్నా
|
తొలుత యాడ్ ఫిల్మ్స్‌లో నటిస్తూ. అనంతరం మోడలింగ్ రంగంలో అడుగిడిన ఈ నటీమణి రొటీన్‌గా కాకుండా వైవిధ్య పాత్రలకు పెద్ద పీఠ వేస్తానంటోంది. తొలి రెండు చిత్రాలు ఫెయిల్యూర్ అవ్వడంతో కాస్త నిరాశకు గురయ్యానని.. అయితే మోడలింగ్ రంగంలో బాగా రాణించానని పేర్కొంది.
నిజానికి మోడలింగ్ రంగంలో ఉండగా.. ఓ రోజు శేఖర్ కమ్ముల తనను కలిసి ఓ పాత్ర చేయమని అడగడంతో హ్యాపీడేస్ చిత్రం అవకాశం వచ్చింది. అంతే కాక అందులో నా పాత్ర ప్రాధాన్యత చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. 'అందరూ కూడా చాలా బాగా చేశావ్' అన్నారంది.
అయితే ప్రతి మనిషికి నిరాశ సహజమైందని చెప్పే ఈ నటీమణి తెలుగు తెర నుంచి పెద్ద ఆఫర్లను రాబట్టుకుంటోంది. ప్రస్తుతం సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. వైవిధ్య పాత్రలనే తాను ఎన్నుకంటానని చెబుతోంది.