1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

చిరంజీవి 149వ చిత్రానికి దర్శకుడు ఖరారు

చిరంజీవి 149వ చిత్రం దర్శకుడు ఖరారు
FileFILE
మెగాస్టార్ చిరంజీవి 149వ చిత్రానికి దర్శకులను ఖరారు చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు గుణశేఖర్, వి.వి.వినాయక్‌ల పేర్లు వచ్చాయని.. అయితే చివరికి వినాయక్ పేరు ఖరారు చేసినట్లు ఫిలిం నగర్ వర్గాలు తెలిపాయి.

అలాగే ఈ చిత్రానికి సంగీతం... చెలి, అపరిచితుడు, ఘర్షణ వంటి మ్యూజికల్ హిట్స్ అందించిన హరీష్ జయరాజ్ బాణీలు సమకూర్చనున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అల్లుఅరవింద్, అశ్వినీదత్‌ల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలిపాయి.

స్టాలిన్ చిత్రం తర్వాత.. శంకర్‌దాదా జిందాబాద్ పెద్దగా ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. దీనికితోడు చిరంజీవి తండ్రి మరణంతో ఈ చిత్రం రూపొందడంలో కాస్త ఆలస్యమవ్వచ్చని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.
About Writer
Hanumantha Reddy