మళ్లీ వార్తలకెక్కిన యూకే సెలిబ్రిటీ గర్ల్
|
ఈ పారిశ్రామికవేత్త, తనకు మధ్య ప్రేమాయణం సాగుతున్నట్టు ఆమె స్వయంగా ప్రకటించింది. అయితే.. ఈ ప్రేమకథ ఇంకా ప్రారంభదశలోనే ఉందని, దీనిపై లేనిపోని కట్టుకథలు రాసి మొగ్గలోనే తుంచి వేయవద్దని ఆమె మీడియాకు విజ్ఞప్తి చేయడం గమనార్హం. తాజాగా డైలీ మెయిల్‌కు శిల్పా శెట్టి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన మనస్సులో దాగివున్న ప్రేమ రహస్యాన్ని బయటపెట్టింది.
గత వేసవి కాలంలో లండన్‌కు వెళ్లినపుడు ఆ దేశానికి చెందిన ఒక పారిశ్రామికవేత్తతో పరిచయం ఏర్పడింది. ఇలా.. ఆరంభమైన తమ ప్రేమకథ అపుడపుడూ డేటింగ్‌లకు వెళ్లే వరకు వచ్చింది. అయితే మా మధ్య ఉన్న పరిచయం ఇంకా ఆరంభదశలోనే ఉంది. నేను చాలా అందంగా ఉంటానని, నా కోసం, నా స్నేహం కోసం కోట్లాది మంది పడితపిస్తారని పలు మ్యాగజైన్‌లలో కథనాలు వస్తుంటాయి.
అయితే.. ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా నా ఎదుటకు వచ్చి ఇష్టపడుతున్నట్టు చెప్పేందుకు సాహసం చేయలేదు. వివిధ కార్యక్రమాల నిమిత్తం.. విదేశాలకు వెళ్లినప్పుడు ఒంటరి తనం నన్ను చాలా వేధించేది. ముఖ్యంగా ఇంటికి దూరంగా ఉన్పప్పుడు చాలా బోర్‌గా కొట్టేది.
ఇప్పటి వరకు బాయ్‌ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. నాకు కూడా ప్రేమను పంచుకోవాలని ఉంది. అందుకే.. లండన్ పారిశ్రామికవేత్తతో మనస్సు విప్పి మాట్లాడుతున్నానని యూకే సెలబ్రిటీ శిల్పాశెట్టి కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.