1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

''ప్రేమాభిషేకం''తో నిర్మాతగా మారిన వేణుమాధవ్

సావిత్ర సినిమా పతాకంపై ఎస్ఎస్.విక్రమ్ గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ప్రేమాభిషేకం'.
WD PhotoWD
సావిత్ర సినిమా పతాకంపై ఎస్ఎస్.విక్రమ్ గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ప్రేమాభిషేకం'. ఈ చిత్రంలో హాస్యనటుడు వేణుమాధవ్ నిర్మాతగా మారి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ మాట్లాడుతూ.. అనివార్య కారణాల వల్ల నిర్మాతగా మారినట్టు చెప్పారు. ఆనాటి 'ప్రేమాభిషేకా'నికి నేటి 'ప్రేమాభిషేకా'నికి ఏ మాత్రం పొంతన లేదన్నారు. అయితే.. ఈ చిత్రం ఆద్యంతం వినోదభరితంగా ఉంటుందని వివరించారు.

జనవరిలో చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి, ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేస్తామని, ఇందులో శ్రీహరి ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నట్టు చెప్పారు. దాసరి నారాయణ రావు కథను అందిస్తున్న ఈ చిత్రానికి చక్రి సంగీతం సమకూర్చుతున్నారు. రుతిక, ప్రియామోహన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత.. గోపాలకృష్ణ, నిర్వహణ.. బాలాజీ శ్రీను, సమర్పణ.. త్రివిక్రమ్, స్క్రీన్ ప్లే దర్శకత్వం.. ఎస్ఎస్.విక్రమ్ గాంధీ.
About Writer
PNR